ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఎన్ని వేరియేషన్లు చూపించాడో - పవన్‌ కళ్యాణ్‌పై వామపక్షాల సెటైర్‌

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్‌పై…. ఇప్పటికీ కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. అవసరం లేని మాటలు మాట్లాడారని కొందరు అంటుంటే… అర్థం లేని ప్రసంగాలు చేశారని మరికొందరు విమర్శిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు.. ఆయన ఇచ్చిన స్పీచ్‌కు ఏమైనా సంబంధం ఉందా అంటూ మరికొందరు.. చర్చించుకుంటున్నారు. అసలు.. ఆ ప్రసంగంతో పవన్‌ కళ్యాణ్‌.. ఏం చెప్పదలుచుకున్నారో కూడా అర్థం కాలేదన్నది విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే… వామపక్షాలు కూడా తమ స్టయిల్‌లో.. పవన్‌ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఆయనకు పిచ్చిపట్టినట్టు ఉందంటూ.. ఘాటుగా స్పందించారు లెఫ్ట్‌ పార్టీల నేతలు.

పవన్‌ కళ్యాణ్‌ ఒక నటుడు. ఒక్కో సినిమాలో.. ఒక్కో గెటప్‌ వేస్తాడు. ఆ గెటప్‌కు తగ్గట్టు నటిస్తాడు. అలాగే.. రాజకీయాల్లోనూ చేద్దామనుకున్నాడో ఏమో. ఏ పార్టీతో కలిసి పనిచేస్తే… ఆ భావజాలన్ని తలకెక్కించున్నాడు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత.. ముందుగా వామపక్షాలతో పొత్తుపెట్టుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఆ సమయంలో వామపక్ష భావజాలాన్ని పండించారు. ఒకప్పుడు తాను కూడా మావోయిస్టుల్లో చేరిపోదామని అనుకున్నట్టు చెప్పారు. సరే అది బాగానే ఉంది… ఆ తర్వాత… వామపక్షాలను వదిలేసి.. మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు.. దళితరాగం అందుకున్నారు. గంటలు గంటలు ప్రసంగాలు చేశారు. ఇప్పుడు బీజేపీతో జత కలిశారు. ఇప్పుడు లెఫ్ట్‌ భావజాలం లేదు… దళితుల ప్రస్తావన అంతకంటే లేదు. అంతా… సనానత ధర్మమే. ఒంటిపైకి కూడా కాషాయ వస్త్రం వచ్చేసింది. ప్రాయచ్ఛిత్త దీక్షలు చేసేశారు… ఆలయాల సందర్శన చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయమని చెప్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నటుడే కావొచ్చు… కానీ.. రాజకీయాల్లో కూడా ఇన్ని వేరియేషన్లు చూపిస్తాడని అనుకోలేదంటున్నారు వామపక్ష నాయకులు.

సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌కు… పంచాయతీరాజ్‌ శాఖ కాకుండా.. దేవాదాయశాఖ ఇచ్చుంటే బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు వామపక్ష నేతలు. పాలన గాలికి వదిలేసి కాషాయం కట్టుకుని తిరిగేవాడని.. ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన్ను పిచ్చాస్పత్రిలో చేర్పించాలని… లేదంటే ఇప్పట్లో సెట్‌ కాడని కూడా పవన్‌పై కౌంటర్లు పడుతున్నాయి. ఆయన నార్మల్‌ కావాలంటే పిచ్చాస్పత్రిలో చేర్పించడమే మార్గమని కూడా చెప్తున్నారు.

వామపక్ష నేతలే కాదు.. తమిళనాడు నుంచి కూడా పవన్‌కళ్యాణ్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ మెప్పు కోసం మాట్లాడారో ఏమో తెలియదు కానీ… అవసరం లేకపోయినా… స్టాలిన్‌పై విమర్శలు చేశారు. హిందీపై వివాదం అవసరం లేదన్నారు. దీంతో.. డీఎంకేతోపాటు తమిళనాడు ప్రజలు కూడా పవన్‌ కళ్యాణ్‌.. పొట్టుపొట్టు తిడుతున్నారు. అవసరం లేకపోయినా విమర్శలు చేసి.. అందరితోనూ మాటలు అనిపించుకుంటున్నారు పవన్‌. రాజకీయాల్లో ఇదో స్ట్రాటజీ అని కూడా చెప్పాలి. విమర్శల ద్వారా అయినా… తాను, తన పార్టీ చర్చల్లో ఉండాలని కోరుకునే వారు ఉంటారు. అలా హైలెట్‌ అవ్వాలని కూడా కోరుకుంటారు. మరి.. పవన్‌ స్ట్రాటజీ కూడా అదేనా…?

Back to top button