
హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. రేపు శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని సూచనలు తెలియజేశారు. మహాశివరాత్రి రోజున పూజకు ఉపయోగించే సామాగ్రిని మొత్తం కూడా బొట్టు పెట్టుకున్న వారి దగ్గరే కొనాలని భక్తులకు సలహా ఇచ్చారు. ఎవరైతే శివ భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా పూలు మరియు కొబ్బరికాయలు లాంటి పూజ సామాగ్రిని హిందువుల దగ్గరే కొనాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేవాలయాలకు వెళ్లే ప్రతి మనిషి కూడా హిందువుల వద్దే సామాగ్రి కొనాలని సూచించారు. మనం పవిత్రంగా ఉన్న అమ్మేవారు సరిగా ఉన్నారో లేదో ఒకసారి చూసుకోవాలని అన్నారు. కొంతమంది వారం, పది రోజులు పాటు కూడా స్నానం చేయకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ‘మీరు ఎక్కడ కొంటున్నారు అనేది మీ ఇష్టం.. కానీ బాధ్యతగా చెబుతున్నా’ అంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుత అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జగన్.. ఇదేనా మీ సాంప్రదాయం- వైసీపీ తీరుపై ఏపీ స్పీకర్ ఫైర్
అయితే అతను కేవలం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పూజ సామాగ్రిని చెడ్డ వ్యక్తుల ద్వారా కొంటె ఆ పూజకు ఫలితం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. హిందూ సాంప్రదాయాలను పాటించే వారి నుండి ఆ సామాగ్రి కొనడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అమ్మేవారు సరిగా ఉన్నారో లేదో ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలి. కొంతమంది పద్ధతిగా లేకపోవడంతో పాటుగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తూ పూజ సామాగ్రికి కూడా విలువ ఇవ్వకుండా ఉంటారు. కాబట్టి వారి దగ్గర అసలు కొనకండి అంటూ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సలహా ఇస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
టిడిపికి భారీ ఎదురు దెబ్బ.. ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా!..
చందిప్ప మరాటిగూడలో చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ