
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కసిరెడ్డి ద్వారా తీగ లాగి… డొంక కదిలించాలన్నది కూటమి ప్రభుత్వం ప్రయత్నం. అందుకే సిట్‌ను రంగంలోకి దించింది. ఆ డొంక జగన్ వరకు వెళ్తుందా…? మిథున్‌రెడ్డితో ఆగిపోతుందా..? అన్నది తేలాల్సి ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు మించి… ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. దీన్ని వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయులు బయటపెట్టారు. ఏపీ లిక్కర్ స్కామ్‌పై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర సంస్థలు వచ్చేలోపు… రాష్ట్రం పరిధిలో సిట్‌ను ఏర్పాటు చేసి… స్కామ్‌కు సంబంధించిన గుట్టు బయటపెట్టాలని కూడా భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో.. సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. లిక్కర్ స్కామ్‌లో కింగ్‌పిన్‌గా భావిస్తున్న.. రాజ్‌కసిరెడ్డిని టార్గెట్ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. కానీ… ఆయన స్పందించకపోవడంతో…. ఒత్తిడి పెంచేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై రైడ్స్ చేశారు. కీలక సమాచారం కూడా రాబట్టినట్టు సమాచారం. మరోవైపు కసిరెడ్డి.. పరారీలో ఉన్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి.
Also Read : లక్ష ఎకరాల రాజధానిగా అమరావతి – అభివృద్ధా..? – భూ దాహమా..?
ఏపీలో 3వేల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి… ఎక్కువగా లిక్కర్ వ్యాపారంపైనే ఫోకస్ చేశారట. నెలకు 60కోట్ల ముడుపులు మూట్టగట్టుకున్నారట. ఆ డబ్బుతో… పలు ఆస్పత్రుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారట. బినామీ పేర్లతో సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారట. కూతురి పేరు మీద ఇన్ఫ్రా కంపెనీ కూడా పెట్టినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇప్పుడు.. కసిరెడ్డితో మొదలైన దర్యాప్తు… ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అన్న దానిపై ఏపీ రాజకీయాల్లో హాట్‌హాట్ చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా… తీగ లాగితే… డొంక అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు వెళ్లింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందా…? ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ తీగకు సంబంధించిన డొంక ఎవరి దగ్గర ఆగుతుంది. స్కామ్ వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి… వైఎస్ జగన్ వరకు చేరుతుందా…? లేదా మిథున్‌రెడ్డితోనే ఆగుతుందా…? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..