తెలంగాణలైఫ్ స్టైల్

తెలంగాణ పోలీస్ విభాగంలో 325 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) చేపట్టిన డ్రైవర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది.
పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్, ఫైర్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లలో 325 డ్రైవర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ నియామక ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పోస్టుల వివరాలు: పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO) విభాగంలో ఈ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నిర్వహణ: ఈ నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) చేపట్టనుంది.
అర్హతలు: అభ్యర్థులకు నిర్దేశించిన విద్యార్హతలతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (HMV/LMV) ఉండాలి.
ప్రకటన: త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం TSLPRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Back to top button