జాతీయం

అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ మృతి.. ముంబయి ఉగ్రదాడిలో సూత్రధారి

క్రైమ్ మిర్రర్,ఆన్ లైన్ డెస్క్ : ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావ మరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా (జేయూడీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం రోజు పాకిస్థాన్ లాహోర్‌లో గుండెపోటుతో మరణించారు. మధుమేహ సమస్యతో గత కొద్ది కాలంగా బాధ పడుతున్న ఆయన లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు. ఈ విషయాన్ని జేయూడీ అధికారి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాకిస్థాన్ మురిద్కేకు చెందిన అబ్ధుల్ రెహ్మా మక్కీ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన లష్కర్ ఎ తోయిబా, జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరించారు. ఇతడికి 26/11 ముంబయి దాడులతో పాటు భారత్‌లో జరిగిన అనేక దాడులతో సంబంధం ఉంది.

Read Also : ఇద్దరు మహానుభావులను కోల్పోయిన భారత్!… 2024 తీరనిలోటు?

ముఖ్యంగా 2000 సంవత్సరంలో డిసెంబర్ 22న ఎర్రకోటలో, 2008 జనవరి 1న రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై, 2018లో ఫిబ్రవరి 12-13వ తేదీల్లో కరణ్ నగర్ (శ్రీనగర్)లో, 2018 మే 30వ తేదీన బారాముల్లాలో, అదే ఏడాది జూన్ 14న జరిగిన శ్రీనగర్ దాడితో పాటు అదే సంవత్సరం ఆగస్టు 7న జరిగిన గురేజ్ దాడిలో మక్కీ కీలక పాత్ర పోషించారు. ఈక్రమంలోనే మక్కీని 2019 మే 15వ తేదీన పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. 2020లో అతడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో దోషిగా నిర్దారించబడ్డాడు. దీంతో పాకిస్థాన్ కోర్టు అతడికి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఆ తర్వాత నుంచి మక్కీ ఉగ్రదాడులకు కాస్త దూరం అయ్యాడు. బహిరంగంగా కూడా కనిపించడం మానేశాడు. అయితే 2023 సంవత్సరం జనవరిలో UNSC అబ్ధుల్ రెహమాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు ప్రయాణాలపై, ఆయుధాలపై నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలి.. మంత్రి కొండా సురేఖ
  2. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ నిరసనలు
  3. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
  4. ఇక ఈ బ్యాంకు కనిపించదు.. 4 రోజులు సేవలు బంద్!!!
  5. తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం…వారం రోజుల పాటు అధికారిక వేడుకలు రద్దు

Back to top button