
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు సెమి ఫైనల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంతో పాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్ లో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా మహిళల జట్టు 49.5 ఓవర్లకు 338 పరుగులు చేశారు. ఆ తరువాత 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 48.3 ఓవర్లలోనే చేదించింది. ఈ మ్యాచ్ లో జిమ్మీ రాడ్రిక్స్ 127 పరుగులు చేసి జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచారు. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 89 పరుగులతో రాణించి జట్టు విజయానికి కీలక పాత్రలు పోషించారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత జట్టులోని ప్రతి మహిళతోపాటు డక్ అవుట్ లో ఉన్న వారందరూ కూడా బాగోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ మ్యాచ్ కి ముందు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బలమైన జట్టు ఆస్ట్రేలియా అనే విజయం సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ వారి మాటలను తిప్పి కొట్టి ఎన్నడు లేనటువంటి చరిత్రను సృష్టించారు. ఇక రేపు ఆదివారం సౌత్ ఆఫ్రికా తో మన భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ లో పోటీ పడనుంది. వీరిలో ఎవరు గెలిస్తే వారే ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచిన వారు అవుతారు.
Read also : పెళ్లి పీటలు ఎక్కనున్న భారత స్టార్ మహిళా క్రికెటర్.. వరుడు ఇతడే?
Read also : తుఫాన్ కారణంగా పంటలన్నీ నాశనం.. మన ప్రభుత్వమే బెటర్ : వైయస్ జగన్





