
ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిందట. టీటీడీ చైర్మన్ ఓ ప్రాజెక్టుకు అడ్డుచెప్తే… సీఎం చంద్రబాబు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయంలో… వీరి మధ్య వాదన జరిగిందని సమాచారం. ముఖ్యమంత్రితో వాదనకు దిగాల్సిన అవసరం టీటీడీ చైర్మన్‌కు ఏం వచ్చింది..? అసలు… ఆ ప్రాజెక్ట్ ఏంటి..? టీటీడీ చైర్మన్ ఎందుకు అడ్డుచెప్పారు..? సీఎం ఎందుకు లైన్‌క్లియర్ చేశారు..?
చెన్నైలో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ టీటీడీ ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. తన వెంచర్లు ఉన్న చోట… టీటీడీ ఆలయం నిర్మిస్తామని తెలిపింది. ఆ ఆలయ నిర్మాణానికి కావాల్సిన డబ్బును తామే భరిస్తామని చెప్పింది. అయితే… ఈ ప్రతిపాదనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంగీకరించలేదు. టీటీడీ పేరుతో శ్రీవారి ఆలయం కట్టుకుని… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇంత వరకు బాగానే ఉంది. అయితే… రెండు రోజుల క్రితం టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో… జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతిపాదన సీఎం దృష్టికి వచ్చింది.
Also Read : బుగ్గన, రోజాకు వైఎస్ జగన్ క్లాస్ – తప్పు రిపీట్ చేయొద్దంటూ వార్నింగ్..!
ఆయన… ఏ మాత్రం ఆలోచించకుండా… ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పేశారట. ఈ విషయంలో… సీఎం చంద్రబాబుతో వాదనకు దిగారట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. దేవుడు పేరు చెప్పుకుని వ్యాపారం చేస్తామంటే ఎలా అంగీకరిస్తామని ముఖ్యమంత్రితో అన్నారట. అయినా సీఎం చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ మాటను లెక్కలోకి తీసుకోలేదట. సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తే ఎందుకు అడ్డుకోవాలంటూ బీఆర్ నాయుడిపై ఫైరయ్యారట. అంతేకాదు జీ స్క్వేర్ సంస్థ నిర్మించే ఆలయానికి టీటీడీ సహకరించాలని హుకుం జారీ చేశారట ముఖ్యమంత్రి.
ఒక రియల్ ఎస్టేట్ సంస్థ.. దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారాభివృద్ధి కోసం ఆలయం నిర్మిస్తామంటే… ప్రభుత్వం ఒప్పుకోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సొంత డబ్బులతో ఎవరైనా ఆలయం నిర్మించుకోవచ్చు.. కానీ దానికి టీటీడీ ఆలయం అని పేరెందుకో…? అన్నది ఇక్కడ ప్రశ్న. అంటే… ఆలయం నిర్మించినా… దాని బాగోగులు, నిర్వహణ టీటీడీ చూసుకోవాలా..? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు..?