తెలంగాణ

మరో వారం రోజులు వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణను వరుణుడు వదలడం లేదు. గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయమంతా ఎండ కాస్తూ సాయంత్రానికి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం, సోమవారం కురిసిన వర్షానికి హైదరాబాద్ ఆగమాగమైంది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

Read More :  ప్రతి ఎకరాకు 7500.. రైతుల అకౌంట్లో జమ.. వాళ్లకు కట్!

మంగళవారం నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

 Read More : అనుముల తిరుపతి రెడ్డి గారు.. మీరు చాలా గ్రేట్.. కేటీఆర్ సంచలన ట్వీట్ 

బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అలర్ట్ చేశారు.

Back to top button