తెలంగాణ

మళ్లీ కేసీఆర్‌కు అస్వస్థత – ఆయన ఆరోగ్యానికి ఏమైంది…?

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- కేసీఆర్‌ ఆరోగ్యానికి ఏమైంది..? ఆయన ఇటీవల తరచూ ఆస్పత్రిలో చేరుతున్నారు. దీంతో.. పార్టీ శ్రేణులు, అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది. పదే పదే ఆయన ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది. అసలు.. పెద్దసారుకు ఏమైంది..? అన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత. ఆయన ఆరోగ్యం ఈ మధ్య కాస్త మెత్తబడింది. తరచూ ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో.. కేసీఆర్‌ ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్కరోజే… ఆయన ఫామ్‌హౌస్‌లో జారిపడ్డాడు. దీంతో.. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి తరచూ కేసీఆర్‌ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. నెల క్రితం ఆయన యశోదా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు కూడా చేశారు. మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు కేసీఆర్‌. ఆ తర్వాత పలుమార్లు ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు కేసీఆర్‌. ఆయన ఏమైందన్న ఆందోళన ప్రజల్లో ఉన్నా… ఆయన ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు బయటకు రావడంలేదు.

Read also: ఢిల్లీ సీఎంకు Z+ కేటగిరీ భద్రత ఉపసంహరణ, కేంద్రం కీలక నిర్ణయం!

కేసీఆర్‌కు షుగర్‌, సోడియం స్థాయిలో తేడాలను గుర్తించారు డాక్టర్లు. అందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. డాక్టర్ల బృందం కేసీఆర్‌ ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ… కేసీఆర్‌ను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఫామ్‌హౌస్‌ వైద్య సేవలు అందించినా… ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే… హైదరాబాద్‌కు తరలిస్తారని సమాచారం. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.

Read also : ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్, ‘గగన్‌యాన్‌’లో కీలక ముందడుగు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button