
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో మంత్రి పదవి చిచ్చు పెట్టింది. జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కేబినెట్ రేసులో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. తనకు మంత్రిపదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ పరోక్షంగా వివేక్ ను టార్గెట్ చేశారు ప్రేమ్ సాగర్ రావు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే వివేక్ కుటుంబంపై విమర్శలు చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్లకు పదవులు ఇవ్వాలి కాని.. పార్టీలు మారి వచ్చినవాళ్లకు కాదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ ను బతికించింది ఎవరో కార్యకర్తలకు తెలుసన్నారు.
Also Read : మోడల్ ఫొటోతో ఎన్ఆర్ఐకి బురిడీ .. 3 కోట్లు కాజేసిన అక్కాచెల్లెళ్లు
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. తమ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబం అన్నారు వివేక్. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటారని గుర్తు చేశారు.
Also Read : బెంగళూరులో దారుణం… భార్యను చంపి సూట్ కేసులో కుక్కి పారిపోయిన భర్త!
దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలని అహంకారంతో బాల్క సుమన్ సవాల్ చేశాడని.. సవాళ్లను స్వీకరించి 22 రోజులలోనే ప్రచారం చేసి బాల్క సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపానని వివేక్ చెప్పారు. బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్న కూడా తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని వివరించారు. కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని వివేక్ మండిపడ్డారు. అలాంటి రాజకీయాలు అంటే తనకు అసహ్యం అన్నారు. నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. తాను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశానని తెలిపారు. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని.. ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..