
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడమే కాకుండా 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు.
1.కోస్తాంధ్ర,
2.యానం
3.గుంటూరు
4.ప్రకాశం
5నెల్లూరు
6చిత్తూరు
7కర్నూల్
ఈ 7 జిల్లాలలో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరించారు. మరోవైపు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో నేడు, రేపు ప్రకాశం జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా హోం మంత్రి అనిత ఇప్పటికే ప్రకాశం జిల్లాకు NDRF బృందాలను పంపించారు. కావున ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని సూచించారు. మరోవైపు వాహనదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏవైనా సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు వెల్లడించారు.
Read also : ఈశ్వర్ – బాహుబలి.. ప్రభాస్ బర్త్డే స్పెషల్!
Read also : నేడే భారత్ VS ఆస్ట్రేలియా రెండవ పోరు… అదృష్టం మన వైపే?