తెలంగాణరాజకీయం

రాజాసింగ్‌ మళ్లీ బీజేపీలోకే వెళ్తారా..? శివసేనలో చేరిపోతారా..?

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో రాజాసింగ్‌ రాజీనామాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజాసింగ్‌ మళ్లీ బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు పిలిచి మాట్లాడితే… ఆయన సర్దుకుంటారని… కమలంలోనే కొనసాగుతారన్న చర్చ జరుగుతోంది. అలా కుదరుదు అనుకుంటే… రాజాసింగ్‌ మరో మార్గం కూడా చూసిపెట్టుకున్నారట. ఆ పార్టీ ఇంకేదో కాదు శివసేన. ఉంటే బీజేపీ.. లేదంటే శివసేన అని ఫిక్సై పోయారట. మరి ఆయన అడుగు… అటా.. ఇటా అన్నదే ఇప్పుడు తేలాలి.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారు రాజాసింగ్‌. అది దక్కలేదు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తే.. తన అనుచరులను అడ్డుకున్నారని.. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాలని కూడా చెప్పారు. అయితే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారే గానీ.. ఎమ్మెల్యే పదవికి రిజైన్‌ చేస్తున్నట్టు ఆయన ఎక్కడ చెప్పలేదు. పైగా… హిందుత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు రాజాసింగ్‌. ఈ ప్రకటన.. ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో… రాజాసింగ్‌ రాజకీయ భవిష్యత్‌ గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వల్లభనేని వంశీ – కన్నీరుపెట్టుకున్న భార్య

రాజాసింగ్‌ తీరు.. సొంత పార్టీ నేతలపై ఆయన చేసిన విమర్శల గురించి బీజేపీ అధిష్టానం ఆయనపై చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఆయన రాజీనామాను కూడా లైట్‌ తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాజాసింగ్‌.. శివసేన పార్టీతో టచ్‌లోకి వెళ్లారట. శివసేనలో చేరి హిందుత్వాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారట. అయితే… ఒకవేళ బీజేపీ హైకమాండ్‌ పిలిచి మాట్లాడితే… నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా.. బీజేపీ తుది నిర్ణయం తర్వాత… ఆయన తర్వాత స్టెప్‌ వేయబోతున్నారని సమాచారం. రాజీనామాపై ఢిల్లీ బీజేపీ పెద్దలు చర్చిస్తే ఓకే.. లేదంటే శివసేన ఉందిగా అనే రీతిలో ఉన్నారట రాజాసింగ్‌. ఆయన పయనం ఎటువైపు అన్నది… బీజేపీ అధిష్టానంపైనే ఆధారపడి ఉందని.. వారి నిర్ణయం ఆధారంగానే రాజాసింగ్‌ నిర్ణయం ఉంబోతోందని ఆయన వర్గం చెప్తోంది.

Back to top button