ఆంధ్ర ప్రదేశ్

అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలు

  • నలుగురిని సస్పెండ్‌ చేసిన టీటీడీ అధికారులు

  • క్వాలిటీ కంట్రోల్‌ డీఈ, బర్డ్‌ ఆస్పత్రి స్టాఫ్‌ నర్స్‌ సస్పెన్షన్‌

  • ఫార్మాసిస్ట్‌, ఆయుర్వేద ఆస్పత్రి సిబ్బందిపై వేటు

క్రైమ్‌ మిర్రర్‌, తిరుపతి: అన్యమత ఉద్యోగుల విషయంలో టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు అధికారులు. క్రిస్టియానిటీని అనుసరిస్తూ, ఉద్యోగ నియమాలను ఉల్లంగించారని విజిలెన్స్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో నలుగురిని సస్పెండ్‌ చేస్తూ టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.

సస్పెండ్‌ అయింది వీరే…

క్రైస్తవ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విజిలెన్స్‌ విచారణలో బట్టబయలు కావడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బి.ఎలిజర్‌, స్టాఫ్‌ నర్స్‌ రోసీ, ఫార్మాసిస్ట్‌ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న క్రిస్టియన్‌ అసుంతను సస్పెండ్‌ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ నియమావళిలో ఉద్యోగులంతా హిందూమతాన్ని పాటించాలని, ఎవరూ భిన్నంగా వ్యవహరించొద్దని క్లియర్‌గా పొందుపరిచారు. దీన్ని ఉల్లంఘించినవారిపై దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Back to top button