ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

టీడీపీ-జనసేన మధ్య గ్యాప్‌ వస్తోందా..? - అందుకు కారణం నాగబాబేనా..!

JANASENA Vs TDP : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలే అవుతోంది. అప్పుడే టీడీపీ-జనసేన మధ్య గ్యాప్‌ వస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేశారు పవన్‌ కళ్యాణ్‌. ఈ విషయంలోనే రెండు పార్టీ మధ్య తేడాలు వచ్చాయని సమాచారం. టీడీపీ తీరుతో విసిగిపోయిన పవన్‌ కళ్యాణ్‌.. సీఎం చంద్రబాబును సంప్రదించకుండానే.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ప్రకటించారని చర్చ జరుగుతోంది.

నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి.. కేబినెట్‌లో స్థానం కల్పించాలని పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇదివరకే… ఈ విషయంపై ప్రకటన కూడా చేశారు. తీరా సమయం వచ్చేసరికి… అందుకు విరుద్ధంగా ప్రచారం జరిగింది. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పవన్‌ కళ్యాణ్‌కు ఇష్టం లేదని… కథనాలు వచ్చాయి. నాగబాబును రాజ్యసభకు పంపుతారని… లేదా కేబినెట్‌ హోదా ఉన్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం చంద్రబాబును కలిసిన పవన్‌ కళ్యాణ్‌ ఇదే విషయం చర్చించారని కూడా ప్రచారం జరిగింది. ఇదంతా పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి వెళ్లడంతో.. ఆయన విసిగిపోయారని అంటోంది జనసేన వర్గం. ఇదంతా… టీడీపీ చేస్తున్న ప్రచారమని భావించిన పవన్‌ కళ్యాణ్‌… వీటికి చెక్‌పెట్టాలని భావించారట. అందుకే… నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్టు జనసేన అధికారిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నాగబాబును నామినేషన్‌ వేసుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించినట్టు కూడా ఆ పోస్టులో ఉంది.

నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో… తనపై తప్పుడు ప్రచారం జరగడం పవన్‌ కళ్యాణ్‌కు మింగుడు పడలేదని అంటున్నారు జనసేన వర్గీయులు. అందుకే చంద్రబాబును సంప్రదించకుండా… నిర్ణయం తీసుకున్నారట. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును సొంతంగా ప్రకటించేశారు పవన్‌ కళ్యాణ్‌. గతంలో ఒకసారి కూడా ఇలానే జరిగింది. జనసేనతో చర్చించకుండా… రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అప్పుడు కూడా పవన్‌ కళ్యాణ్‌ ఇలానే వ్యవహరించారు. తగ్గేదేలే అంటూ… ఒకరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను సొంతగా ప్రకటించేశారు. అప్పుడు రెండు పార్టీల మధ్య వచ్చిన దూరం… చర్చలతో సమసిపోయింది. ఇప్పుడు మళ్లీ… రెండు పార్టీల మధ్య గ్యాప్‌ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈసారి కూడా సర్దుకుంటారా…? కూటమి పార్టీ మధ్య విభేదాలు ఉన్నా.. కలిసే పనిచేస్తామని అసెంబ్లీలో పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉంటారా…?

ఇవి కూడా చదవండి .. 

ఏసీబీకి పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్

అద్దంకి దయాకర్‌కు మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ రేసులో జానారెడ్డి అనుచరుడు?

కిషన్‌రెడ్డి – బండి సంజయ్‌ మధ్య క్రెడిట్‌ వార్‌ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?

సీఎం రేవంత్‌కు బిగ్ షాక్.. లగచర్ల భూసేకరణ రద్దు

Back to top button