
చండూరు, క్రైమ్ మిర్రర్:
లయన్స్ క్లబ్ చండూరు సేవ నూతన అధ్యక్షుడిగా లయన్ జానయ్య సంగు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఇమీడియెట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ లయన్ మోహన్ రావు తీగల, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె వి ప్రసాద్ ల సమక్షంలో భాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు సంగు జానయ్య ను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ నాపై విశ్వాసంతో నాకు అప్పగించిన బాధ్యతలను అకుంఠిత దీక్షతో నిర్వర్తిస్తానని, సేవ కార్యక్రమాలను సభ్యుల సహకారంతో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. నూతన కార్యదర్శి , కోశాధికారి గా లయన్ లతీఫ్ పాషా , లయన్ వెంకట్ రెడ్డి ఏనుగు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో లయన్ యాదగిరి గంజి ,యం జె ఎఫ్ లయన్ సతీష్ కొత్తపాటి, లయన్ నెల్లూరి శ్రీనివాసులు,, లయన్ కోడి శ్రీనివాస్ , లయన్ దోటి వెంకన్న, లయన్ చిలుకూరి శ్రీనివాసులు, లవ కుమార్, రఘుమా రెడ్డి, నాగరాజు , మహేందర్, లయన్ కోడి అరుణ,లేడీస్ కో ఆర్డినేటర్ లయన్ స్వాతి సంగు, నాగలక్మి, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.