
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనా తారా స్థాయికి చేరుకుంది అని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంది అని అన్నారు. దానికి తోడు పోలీసులను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచక పాలన చేస్తున్నారు అని తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో భాగంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వ ఆరాచక పాలన తారస్థాయికి చేరుకుంది అని కూటమి మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు అని ఆరోపించారు. కావాలనే సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నాయకుల పై ట్రోల్స్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీతో సంబంధం లేనటువంటి మేయర్ పై కూడా అవిశ్వాసం పెట్టి వైఎస్ఆర్సిపి పార్టీపై ట్రోల్స్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు . ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, సంఖ్య బలమున్న క్యాంపు రాజకీయాలు చేయడం ఏంటి అని తీవ్రంగా విమర్శించారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏది తోచితే అది చేస్తున్నారు.. ఇలాంటి వాళ్లకి తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.
Read also : Double Dating Culture: పురుషుల కంటే 3 రెట్లు మహిళలకే ఇంట్రస్ట్ ఎక్కువట!
Read also : ❤️తండ్రి ప్రేమ అంటే ఇదే❤️





