క్రైమ్

బాలాపూర్ లో కిరాతకం.. అద్దంతో కోసి..చున్నీతో ఉరేసి.. కొట్టి చంపిన భర్త

హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను కిరాతంకంగా చంపేశారు. భార్యకు అక్రమ సంబంధం ఉందేమో అన్నానుమనం తో భార్యను కడ తేర్చాడు భర్త . అద్దంతో నరాలు కోసి.. చున్నీతో మెదక్ ఉరి వేసి.. అనంతరం కర్రతో కొట్టి.. ఉన్మాదంగా వ్యవహరించాడు భర్త.

వివరాల్లోకి వెళితే నగర శివారు ప్రాంతం లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీ న్యూ గ్రీన్ సిటీ లోనివాసం చేస్తున్న నజియా బేగం 30 భర్త జాకీర్ అహ్మద్ 31 వీరికి ముగ్గురు సంతానం.ఇంతకు మునుపు గోల్కొండ ప్రాంతం లో ఉండే వారు ఇక్కడ లోకల్ బ్రోకర్ సిరాజ్ ఇల్లు కిరాయికి ఇప్పించాడు.గత కొద్ది రోజులుగా జాకీర్ భార్య పై అనుమానం పెంచు కొని నిన్న రాత్రి భార్యను కట్టే తో కొట్టి , గాజు పెంకు కోసినట్లు, గొంతు నులిమినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

రాత్రి హత్య చేసి ఉదయం అత్త రుబీనాకు తెలిపాడు నిందితుడు. అక్కడి నుండి పారిపోయాడు. మృతిరాలి తల్లి రుబీనా ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నజియా ఈవెంట్ లలో పని చేస్తున్నట్లు తెలిసింది.దీంతో చాలాకాలంగా అనుమానంతో రుబీనాను భర్త వేధిస్తున్నాడని తెలుస్తోంది. పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటన బాలాపూర్ లో కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button