
వైఎస్ జగన్ తెగించేశారా..? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారా..? వక్ఫ్ చట్టం విషయంలో న్యాయపోరాటానికి దిగడం వెనుక అర్థం ఇదేనా..? ఇకపై జగన్, కేంద్రంలోని బీజేపీ మధ్య సత్సబంధాలు ఉండవా..? అంటే అవుననే అనిపిస్తోంది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు తలుపుతట్టిన జగన్…. అందరినీ ఆశ్చర్యపరిచారు. జగనేంటి… మోడీకి వ్యతిరేకంగా వెళ్లడమేంటని.. ప్రత్యర్థి పార్టీలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో కూడా ఇదో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లరని చాలా రోజులుగా అపవాదు ఉంది. తనపై ఉన్న కేసుల విషయంలో భయపడి… మోడీ ముందు తలొంచారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ వాదనలు బలం చేకూర్చాయి. కానీ, ఇప్పుడు ఏమైందో… కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు.
Also Read : రేవంత్ నాఇంటికి వచ్చి పిలిస్తేనే కాంగ్రెస్ లో చేరా.. వివేక్ సంచలనం
వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వక్ఫ్ చట్టం-1995కు సవరణలు చేసింది. ఈ బిల్లును ముస్లిం పార్టీలు.. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించి… రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డాక చట్టం చేశారు. ఈ వక్ఫ్ చట్టాన్ని ముస్లిం సంఘాలు తీవ్రం వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. బెంగాల్‌లో అయితే… వక్ఫ్ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారాయి. ఇక… ఏపీలో కూడా ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ తమకు వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ముస్లిం వర్గాలకు అండగా నిలుస్తోంది. అందుకోసం మోడీతో ఢీకొట్టేందుకు కూడా జగన్ సిద్ధమయ్యారు. వక్ఫ్ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది వైసీపీ.
Also Read : నల్గొండ మంత్రులు హెలికాప్టర్ మంత్రులు.. దామోదర సీరియస్ కామెంట్స్
వాస్తవానికి… వైసీపీ మొదటి నుంచి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్‌లో కూడా వక్ఫ్ బిల్లును అపోజ్‌చేసింది. అయితే.. ఎన్డీయేలోని టీడీపీ, జనసేన మాత్రం వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వక తప్పసరి పరిస్థితి. అందుకే.. ఆ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశాయి. కానీ… వైసీపీ మాత్రం వ్యతిరేకించింది. కానీ… టీడీపీ, జనసేన మాత్రం… వైసీపీ లోక్‌సభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించి… రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని ప్రచారం చేశాయి. దీనికి చెక్ పెడుతూ… వక్ఫ్ చట్టంపై సుప్రీం కోర్టు తలుపు తట్టింది వైసీపీ. మోడీ అయినా సరే.. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు జగన్. ఈ నిర్ణయంతో… ముస్లిం సంఘాలు వైసీపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉంది. అంతేకాదు… కేసుల కారణంగా జగన్ కేంద్రానికి భయపడుతున్నారన్న ప్రచారానికి కూడా తెరపడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..