
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.. మొన్నటికిమొన్న రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల చిత్రీకరణ విషయంలో జైలుకు వెళ్లి రాగా శిల్పా శెట్టి కూడా ఈడీ కేసులతో బాగా వైరల్ అయ్యింది. అయితే రీసెంట్ గా ముంబైలోని జుహు పోలీసులు నటి శిల్పా శెట్టి దంపతులపై మరో కొత్త కేసులు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే నటి శిల్పాశెట్టి 2015-23 సంవత్సరకాల మధ్యలో ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో బిజినెస్ నిమిత్తమై దాదాపుగా రూ 60 కోట్ల పైగా డబ్బు తీసుకున్నారట. అయితే ఈ డబ్బు తీసుకున్న సమయంలో శిల్పా శెట్టి ఓ ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్ సెల్లింగ్ టీవీ కి డైరెక్టర్ గా ఉన్నారని, ఆ సమయంలో బిజినెస్ ని ఎక్స్పెన్షన్ చేసే క్రమంలో డబ్బు ఇవ్వగా శిల్పా శెట్టి మాత్రం తమకి అనుకున్న పని చేసి పెట్టలేదని సదరు వ్యాపారవేత్త ముంబై పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో పోలీసులు శిల్పా శెట్టి మరియు ఆమె భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇప్పటివరకు శిల్పా శెట్టి మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో అలాగే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య శిల్పా శెట్టి దంపతులు మనీలాండరింగ్ కేసులో ఇరుకోవడంతో ముంబై పోలీసులు ఏకంగా ఇంటిని జప్తు చేస్తూ ఖాళీ చేయాలని నోటీసులు కూడా పంపించారు. కానీ శిల్పా శెట్టి దంపతులు ఇల్లు ఖాళీ చేసే విషయంలో కోర్టుని ఆశ్రయించడంతో విచారణ పూర్తయ్యేంతవరకూ ఇల్లు ఖాళీ చేయించవద్దని, అలాగే మరింత గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడి అధికారులకి ఆదేశాలు జారీ చేసింది.