
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:– నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కడ్తాల్ మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. వాహనాల కాన్వాయ్ తో కొల్లాపూర్ కు నాయకులు బయలుదేరి వెళ్లారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి సభకు జన సమీకరణ చేశారు. గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్య నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ్మా, మాజీ జెడ్పిటిసి శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమా నాయక్ లతో కలిసి డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ చేగురి వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్ నరేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు రామ్ చందర్ నాయక్, ఇమ్రాన్ బాబా, మంకీ శ్రీను, బాలరాజు, రేణు ,రమేష్, మహేష్, ఖాదర్ రేణు కుమార్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా మంత్రులు.. రికార్డ్ సృష్టించనున్న పవన్ కళ్యాణ్