
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- జిఎచ్ఏంసి బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వర రావుకు వ్యతిరేకంగా బడంగ్‌పేట్ లో పోస్టర్ల కలకలం రేగింది. రాత్రికి రాత్రే మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో మరియు ప్రధాన గోడలపై ఆయనకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.
ముఖ్యంగా “అవినీతిపరులను తరిమికొడదాం – బడంగ్‌పేట్‌ను కాపాడుకుందాం” అనే నినాదాలతో కూడిన ఈ పోస్టర్లు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఆయన పనితీరుపై ఉన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ అవినీతి మరక ఉన్న ఆఫీసర్ మాకొద్దు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి త్రిల్లేశ్వర రావు స్థానంలో అవినీతి ఆరోపణలు లేని అధికారిని నియమించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.
Read also : మహాలక్ష్మి పథకం ద్వారానే ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చింది : బీర్ల ఐలయ్య
Read also : మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన “జి రామ్ జి” చట్టంను రద్దుచేయాలి





