
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఆసియా కప్ 2025 లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ట్రోఫీ తీసుకోకుండానే టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ ట్రోఫీ ప్రజెంట్ చేసే వ్యక్తి పాకిస్తాన్ దేశస్థుడు కావడంతో.. ట్రోఫీని నిరాకరించామని బీసీసీఐ అధికారులతో పాటు క్రికెటర్స్ కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. అయితే పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన టీమిండియా విజయాన్ని భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి అభినందిస్తున్నారు. కానీ దేశంలో ఎన్నో ఏళ్ళు పరిపాలన అందించిన కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు భారత్ గెలుపు పై స్పందించలేదు.
భారత్ మాతాకీ జై అంటూ… ఒక్క అవకాశం ఇవ్వండి.. భారతదేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తాను అంటూ చెప్పుకొచ్చే రాహుల్ గాంధీ కూడా ఇవ్వాలా భారత్ గెలుపు పై ఒక పోస్ట్ కూడా చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీకి దేశమంటే ఎంత భక్తి ఉందో స్పష్టంగా ఈ పరిస్థితిలో ట్వీట్ చేయకపోవడం పట్ల అర్థం అవుతుంది అని.. చాలామంది రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొంతమంది నిటిజనులు సోషల్ మీడియా వేదికగా… రాజకీయాలకు సంబంధం లేనటువంటి క్రీడలపై ఎందుకు పోస్ట్ చేయలేదని నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటుగా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఈ భారత్ విజయం పై ట్వీట్ చేయకపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు. భారత్ లో జీవించే చాలామందికి దేశం పట్ల భక్తి లేదని కొంతమందిని ఉద్దేశించి మండిపడుతున్నారు.