తెలంగాణ
Trending

హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డ తెలంగాణ హైకోర్టు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ హైకోర్టు హైడ్రా పై తాజాగా మండిపడింది. సెలవు రోజుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. శుక్రవారం నోటీసులు ఇస్తుండగా, వాళ్ల నుంచి వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయం ఇస్తూ ఆదివారం వెంటనే కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కో హెడ్ లో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్ హైకోర్టు విచారించింది. వాళ్లు వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు ఒకటి రెండు రోజులైనా సరే సమయం ఇవ్వాలని తెలపడంతో ప్రస్తుతం కూల్చివేతలు ఆగిపోయాయి.

సినిమాను పైరసీ చేసిన వాళ్ళని వదిలిపెట్టం: తండేల్ మూవీ నిర్మాత

కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో హైడ్రా ను ప్రవేశపెట్టి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా కూల్చి వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు మా భవనాలను కూల్చి వేస్తున్నారు అని లబోదిబోమని వేడుకుంటున్నారు. మేము నివసించేది అక్రమ నిర్మాణాలు అయితే వాటికి అనుమతులు ఎలా ఇస్తారని చాలామంది కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. కొన్ని లక్షలు పెట్టి ఇళ్లను కట్టుకుంటే మీరు రెండు రోజుల్లోనే కూల్చివేస్తారా అని ప్రజల నుండి వ్యతిరేకత నెలకొంది. మరోవైపు హీరో నాగార్జున కూడా ఈ హైడ్రా
బారిన పడ్డారు.

బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్!…దాదాపు 31 మంది మావోయిస్టులు మృతి

Back to top button