తెలంగాణ

రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్!

తెలంగాణ సర్కార్ నియమించిన కాళేశ్వరం కమిషన్.. సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి మూడోసారి లేఖ రాసింది కాళేశ్వరం కమిషన్. ఎన్ని సార్లు లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడింది.

కేసీఆర్‌ను దోషిగా నిరూపించాలి అనుకుంటే బూమరాంగ్ అయ్యేలా ఉన్న కాళేశ్వరం కమిషన్ వ్యవహారం.కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసిన కమిషన్. కేసీఆర్ స్టేట్‌మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖ.ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్‌మెంట్ తర్వాత ఓసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసిన కమిషన్. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం. కమిషన్‌కు మినిట్స్ ఇవ్వాలా, వద్దా అని కేబినెట్‌లో చర్చించనున్న సర్కార్

 

 

 

Back to top button