క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి (వేములపల్లి): ఈ నెల 14న జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మిర్యాలగూడ సిఐ పి. ఎన్. డి. ప్రసాద్ పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయితి భవనం వద్ద మిర్యాలగూడ సిఐ పి. ఎన్. డి. ప్రసాద్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తో కలిసి గ్రామా ప్రజలకు స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా సిఐ పి. ఎన్. డి. ప్రసాద్ మాట్లాడుతూ… ఎన్నికలలో ఎవరైనా ఎన్నిక ప్రక్రియ కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగావినియోగించుకోవాలని సూచించారు.
గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకా అయన మాట్అలాడుతూ …అభ్యర్థులు మద్యం, డబ్బులు,ప్రోత్చకాలతో ఓటర్లను మభ్యపెడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యత తో ఉంచుతామన్నారు.
ఎన్నికల లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా చూడాలని. ఎన్నికల సమయంలో కేసులు నమోదు కావడం మూలంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కునువినియోగించుకోవాలని కోరారు.
ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని మిర్యాలగూడ సిఐ పి. ఎన్. డి. ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు,ప్రజలు, గ్రామా కార్యదర్శి శ్రవణ కుమార్,తదితరులు పాల్గొన్నారు..





