
-
స్వయంగా రాసుకున్న కాంగ్రెస్ అధినేత్రి
-
సంచలన అంశాలు పుస్తకంలో?
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ఆవిష్కృతం కానుంది. తన సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని, వ్యక్తిగత, రాజకీయ అనుభవాలను ఆవిష్కరిస్తూ రచించిన ఆత్మకథ విడుదలకు సిద్ధమైంది ‘ బి లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ ‘ పేరుతో రాబోతున్న ఈ పుస్తకం నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తొలి పోస్ట్ చేశారు. కేం బ్రిడ్జ్ లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్లో నా ప్రేమ ప్రయాణం మొదలైంది. రాజీవ్ నేను కలిసి ప్రేమ, నవ్వులు, తీపి జ్ఞాపకాలతో ఒక సరికొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. నవంబరు 10న ఆ ప్రపంచాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను అంటూ ఉద్వేగ భరితమైన వీడియోను, నాటి అరుదైన ఫోటోలను పంచుకోవడం అంతర్జాతీయంగా విశేష దృష్టిని ఆకర్షించింది.
544 పేజీలతో…
ప్రధానంగా రాజీవ్ గాంధీతో తన ప్రేమాయణాన్ని ఈ ఆత్మ కథలో ఆవిష్కరించనున్నారని అర్థం అవుతుంది. దాదాపు 544 పేజీలతో రూపుదిద్దుకున్న ఈ ఆత్మ కథను భారతదేశంలో హార్పర్ కాలిన్స్ ఇండియా, అంతర్జాతీయంగా ప్రఖ్యాత ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ పబ్లిషింగ్ సంస్థలు ప్రచురించనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో తన బాల్యం నుంచి ప్రారంభమై.. 1965లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీతో పరిచయం.. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహ బంధానికి దారి తీసిన తీరును ఈ పుస్తకంలో ఎంతో భావోద్వేగంతో పొందుపరిచారు. భారతీయ సంస్కృతికి ఏమాత్రం పరిచయం లేని ఒక విదేశీ యువతిగా దేశంలో అడుగుపెట్టి.. నెహ్రూ గాంధీ కుటుంబం కోడలుగా ఇమిడిపోయిన వై దాన్ని తనదైన శైలిలో అక్షరబంధం చేశారు.
విషాదగాథలు…
రాజీవ్ గాంధీతో సోనియా గాంధీ ది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. అంతకుమించి అన్నట్టు ఉంటుంది. నెహ్రూ గాంధీ కుటుంబం ఎదుర్కొన్న పెను విషాదాలు, దేశ రాజకీయాలను మలుపు తిప్పిన కీలక ఘట్టాలను కూడా ఈ పుస్తకంలో ఆవిష్కృతం చేయనున్నారు. 1984లో ఇందిరా గాంధీ, 1991లో భర్త రాజీవ్ గాంధీ ఆత్మహృతి దాడిలో మరణం.. వంటి విషాదకర సమయాల్లో తాను ఎలాంటి మానసిక వేదనను అనుభవించారో సోనియా గాంధీ తన ఆత్మ కథలో వివరించే ప్రయత్నం చేశారు. కళ్ళముందే రక్తసంబంధాలు విచ్ఛిన్నమైన పరిస్థితులనుంచి పిల్లలు రాహుల్, ప్రియాంకాలను కాపాడుకుంటూ ఒంటరిగా ధైర్యంగా నిలబడిన తీరును వివరించే ప్రయత్నం చేయనున్నారు.
రాజకీయ అంశాలు…
రాజకీయ ప్రస్థానం పరంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలుగా పనిచేసిన రికార్డు ఉన్న సోనియాగాంధీ, 1990లో బలవంతంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితిలపై కీలక వివరణలు ఇవ్వనున్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అత్యున్నత ప్రధాని పదవి తన ముంగిట ఉన్నప్పటికీ.. ఎందుకు తిరస్కరించారనే అంతరాత్మ ప్రబోధం వెనుక దాగివున్న అసలు నిజాలు, మన్మోహన్ సింగ్ ఎంపిక నేపథ్యం వంటి రాజకీయ రహస్యాలను ఈ పుస్తకం బహిర్గతం చేయనందునే ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10న ఈ పుస్తకం విడుదలైన తర్వాత జాతీయ రాజకీయాల్లో ఏయే కొత్త అంశాలు చర్చకు వస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
- ముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
జడ్జి కుమారుడి కారు బీభత్సం.. 55 ఏళ్ల వ్యక్తి దుర్మరణం
-
బాబాయ్ ఇంట్లో బంగారం చోరీ.. అమ్మి థార్ కొనుగోలు చేసిన యువకుడు!
-
కృష్ణా నదిలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు యువకులు మృతి