
రంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: భూవివాదంలో తండ్రి, కొడుకు మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాలను తీసింది. ఈ దారుణ ఘటన జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం దాసుకల్ గ్రామంలో అర్థారాత్రి చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. భూమి వివాదంలో కోపోద్రిక్తుడైన కొడుకు తండ్రిని తలపై బండరాయితో కొట్టి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
-
‘అగ్గిపెట్టె మచ్చ’ ఇక లేరు.. అనారోగ్యంతో మృతి
-
పెట్రోల్ బంక్ సీజ్‌కు వెళ్లిన ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య
-
భార్యను మరో వ్యక్తితో చూసిన భర్త.. ఇద్దరిపై ఆరు రౌండ్లు కాల్పులు
-
భర్తను చంపి గుండెపోటుగా నమ్మించిన భార్య.. చివరకు ఫోన్లో దొరికిపోయిన రహస్యం