
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా AI మీద ఆధారపడుతున్నారు. ఏఐ కొందరు జీవితాలలో వెలుగు నింపగా.. మరికొందరి జీవితాలలో చీకటిని నింపుతుంది. ఏఐ ద్వారా చాలా కంపెనీలు ఆయా కంపెనీలలో పని చేసే ఉద్యోగులను తక్షణమే తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం ఏఐని అలాగే ఉద్యోగులని.. మేనేజ్ చేస్తూ ఒకవైపు ఏఐ మరియు ఉద్యోగులను చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే తాజాగా జెమిని ఏఐ ఫోటోలను చాలా అద్భుతంగా రీ క్రియేట్ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ జెమిని ఏఐ ద్వారా మన సాధారణ ఫోటోలు కూడా చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసినట్లుగా మనకి అందిస్తుంది. ఈ జెమినీ ఏఐ ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తూ.. ఆ క్రియేట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు.
Read also : వర్షాలకు ప్రజలు నానా తిప్పలు.. హైదరాబాదులో ఏంటి ఈ పరిస్థితి?
అయితే ఈ జెమిని ఏఐ పై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఈ జెమినీ ఏఐ లో ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల ఆ ఫోటోలను ఇతర వెబ్సైట్లకు ఉపయోగించుకుంటారు అని… మరి కొంతమంది ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోస్ లలో కూడా ఉపయోగించుకుంటారు అని చాలా సందర్భాల్లో విని ఉంటాం. చాలామంది పోలీస్ అధికారులు కూడా ఈ విషయంపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోని నెటిజనులు ఈ జెమినీ ఏఐ ద్వారా చాలా సంతోషంగా ఉన్నామని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక మహిళ జెమిని ఏఐపై ప్రశంసలు కురిపిస్తూ ఎమోషనల్ అయింది. ” నేను రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాను.. ఆమెతో ఒక్క ఫోటో కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ లోటు లేకుండా జెమినీ ఏఐ మా అమ్మతో నేను ఉన్నట్లుగా ఒక ఫోటోను క్రియేట్ చేసింది. ఇది చాలా అద్భుతంగా ఉందంటూ.. జెమినీ ఏ ఐ ను ప్రశంసిస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో తన తల్లితో గడిపినట్లుగా.. హగ్ చేసుకున్నట్లుగా ఫోటోలను సృష్టించి నాకు మధుర జ్ఞాపకాలను అందించిన జెమిని ఏఐకు థాంక్యూ అని ఆ యువతి చాలా ఎమోషనల్ అవ్వడంతో పాటు ఎక్కి ఎక్కి ఏడ్చింది. దీంతో ఈ ఏఐ ద్వారా ఒకవైపు నష్టం ఉండొచ్చు కానీ… మరోవైపు చాలామంది బాధలను తీరుస్తుంది అని ప్రశంసిస్తున్నారు.
Read also : విశ్వకర్మలకు ఫెడరేషన్, ఋణ, పింఛన్లు కల్పించాలి : మదనాచారి