
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: స్టాక్ మార్కెట్లో నష్టపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రవీణ్‌కు వివాహరం జరిగింది. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్ షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడలు పెట్టాడు. అందులో నష్టపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య పరువు పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపం చెందిన తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో చైతన్యపురిలోని ఓ భవనం పై నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతడు తీవ్రగాయాపడి అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే చైతన్యపురి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతిసమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
భారీ అగ్ని ప్రమాదం…! భయంతో పరుగులు తీసిన ప్రజలు..
-
నయా ప్రాజెక్ట్‌లతో ముందంజలో వరుణ్ తేజ్: ‘బరి’ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్!
-
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి?: ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు
-
తెలంగాణలో యాసంగి సాగు ఆశాజనకం: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పుంజుకోనున్న పంటల విస్తీర్ణం!