
ఢిల్లీ, క్రైమ్మిర్రర్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ర్టంలో మంగళవారం జరిగిన విమన ప్రమాదంలో ఆరుగురు దర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడ మృతి చెందింది. ఈ ప్రమాదం పై సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు స్పందించారు. ఈ ప్రమాదం దట్టమైన లటవి ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది.
అయితే, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటల సమయంలో డెల్లోనా పట్టణానికి చెందిన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రాంతం విస్కాన్సిన్ డెల్స్కు సుమారు 10 మైళ్ల దూరంలో ఉంది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, విమానంలో ఉన్న ఆరుగురూ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రజలెవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు.ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఆయా సంస్థల అధికారుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
ఇవి కూడ చదవండి:
- జనసేనలోకి వంగవీటి రాధా.. విజయవాడ మేయర్ పీఠం ఆయనకేనా?
-
సీజేపీ నేతల అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 16న “తిరంగా” ప్రదర్శన.. అభిజీత్ దీప్కే కీలక ప్రకటన!
-
ప్రజల గొంతును నొక్కలేరు.. దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది: ప్రకాశ్ రాజ్
-
షూటింగ్లో పెను ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ఇమ్రాన్ హష్మీ!