సినిమా

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు గాయాలు

  • చికిత్స కోసం హుటాహుటిన అమెరికాకు పయనం

  • కింగ్‌ సినిమా షూటింగ్‌లో సమయంలో ప్రమాదం

  • షారుక్‌కు కండరాలు పట్టేసినట్టు సమాచారం

  • నెలరోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు!

క్రైమ్‌ మిర్రర్‌, సినిమా: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కింగ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముంబైలోని గోల్డెన్‌ టొబాకో స్టేడియంలో కింగ్‌ సినిమా కీలక సన్నివేశాల కోసం భారీ సెట్‌ను వేశారు. ఓ యాక్షన్‌ సీన్‌ చేసే క్రమంలో షారుక్‌ ఖాన్‌కు కండరాలు పట్టేశాయి. దీంతో ఆస్పత్రికి తరలించారు.

నెలరోజులు విశ్రాంతి

గాయం మానడానికి సుమారు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన్ని హుటాహుటిన అమెరికాకు తరలిస్తున్నట్లు వినికిడి. గతంలోనూ ఇదే కండరాల నొప్పితో షారుక్‌ బాధపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య తలెత్తడంతో ఆయనకు చికిత్స అనివార్యమైంది. అయితే షారుక్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని… అభిమానులు ఆందోళనపడొద్దని బాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి.

కింగ్ గురించి…

కాగా, బాలీవుడ్‌ జనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో షారుక్‌ కింగ్‌ ఒకటి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మాణంలో, సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. బాద్‌షా కుమార్తె సుహానా ఖాన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అగ్ర తారాగణం దీపికా పదుకొనె, రాణి ముఖర్జీ, అనిల్‌కపూర్‌, జాకీ ష్రాప్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షారుక్‌ ఇప్పటివరకు 80 సినిమాల్లో నటించగా, 14 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

 

Read Also: 

అవినీతి విషయంలో… పురుషులే కాదు?.. మహిళలు కూడా తగ్గేదేలే?

Back to top button