జాతీయం

ఓట్ల చోరీ ఆరోపణలు.. రాహుల్ పై ఈసీ తీవ్ర వ్యాఖ్యలు!

EC On Rahul Gandhi: ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి  భారత ఎన్నికల సంఘం గట్టి సవాల్ విసిరింది. ఆరోపణలను ప్రస్తావిస్తూ డిక్లరేషన్‌ పై సంతకం చేసి విడుదల చేయాలని సూచించింది. లేదంటే, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ ఆరోపణలు పూర్తి నిరాధారమని చెప్పిన ఈసీ, దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని వెల్లడించింది. డిక్లరేషన్ విడుదల చేయకపోతే రాహుల్ గాంధీకి తన వ్యాఖ్యలపై నమ్మకం లేనట్టు భావించాల్సి వస్తుందని ఈసీ తేల్చి చెప్పింది.  దేశ ప్రజలను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నది. భారత్‌ లో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకమని, అవకతవకలు జరగకుండా అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయని వెల్లడించింది.

ఓట్ల చోరీపై రాహుల్ షాకింగ్ కామెంట్స్

చాలా కాలంగా ఈసీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని రాహుల్ గాందీ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ లో ఒక్క చోట పరిశీలిస్తేనే.. చాలా అక్రమాలు బయటకు వచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఐదు రకాల అవకతవకలతో ఈ మోసం జరిగిందన్నారు. ఒక్క సెగ్మెంట్‌ లోనే లక్షకు పైచిలుకు తప్పుడు ఓట్లు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలన్నారు. అటు రాహుల్ గాంధీ ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందించారు. ఓటర్ల జాబితాలో అనర్హుల లిస్టు ఇవ్వాలన్నారు. తొలగించిన అర్హుల పేర్లను ఇవ్వాలన్నారు. ఈ ఆరోపణలపై తన సంతకంతో కూడిన ఓ డిక్లరేషన్ విడుదల చేయాలని ఈసీ కోరింది.

Read Also: అమెరికా చర్యలకు తగిన జవాబిస్తాం.. సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button