
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హిందువుల అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాయి. అటువంటి వినాయక చవితి పండుగకు మరొక వారం మాత్రమే సమయం ఉంది. అయితే వారం రోజులు సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలు కొనుగోలు చేస్తూ, వాటిని మండపాల వద్దకు తరలించేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గణేష్ విగ్రహాల తరలింపు సందర్భంలోనే ఇప్పటికే చాలా చోట్ల అపశృతి చోటు చేసుకున్నాయి. తాజాగా హైదరాబాదులోని గణేష్ విగ్రహాల తరలింపు సందర్భంలో భాగంగా విద్యుత్ షాకు కు గురై ఇద్దరు యువకులు మరణించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తుంది. బండ్లగూడలో గణేష్ విగ్రహం తీసుకువస్తున్న సమయంలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు ట్రాక్టర్ కు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read also : విద్యాశాఖను గాలికొదిలేశారు.. సీఎం రేవంత్ పై అకునూరి మురళీ సీరియస్
మరోపక్క అంబర్పేట్ లో గణేష్ విగ్రహాలు తీసుకువచ్చేందుకు విద్యుత్ తీగలు తొలగిస్తున్న క్రమంలో రామ్ చరణ్ అనే యువకుడు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గణేష్ విగ్రహాలు తరలింపు క్రమంలో యువకులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. యువత జాగ్రత్తలను పాటిస్తూ.. ఉత్సవాలను సురక్షిత ప్రాంతా వాతావరణం లో.. అది కూడా ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని సూచించారు. ఇంకా గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాకముందే… ఇన్ని అపశృతులు జరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. మరణించిన వారి కుటుంబాలు పండుగ వాతావరణ సమయంలో కూడా ఎంతో బాధతో ఉండాల్సి వస్తుంది అని… కాబట్టి ఉత్సవాల్లో పాల్గొనేవారు వారికి వారే జాగ్రత్తలను తీసుకోవాలి అని… తెలియని పనులలో చేయి దూర్చకండి అని పోలీసులు యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Read also : విద్యాశాఖను గాలికొదిలేశారు.. సీఎం రేవంత్ పై అకునూరి మురళీ సీరియస్