
క్రైమ్ మిర్రర్, చెన్నై:- సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌పై బెదిరింపులు వెల్లువెత్తాయి. టెలివిజన్ సీరియల్ నటుడు రవిచంద్రన్, కమల్ హాసన్ తల నరికేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, రవిచంద్రన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: టర్కీని వణికించిన పెను భూకంపం, కుప్పకూలిన పలు భవనాలు!
ఇటీవల ఒక కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, “సనాతన సిద్ధాంతాలను కూల్చే ఆయుధం విద్య” అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ మతపరమైన వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత రేపాయి. దీనికి ప్రతిస్పందనగా రవిచంద్రన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి.పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలు చెలరేగాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు.
Read also : పులివెందుల ఫైట్‌లో గెలుపెవరిది.. జగన్ అడ్డాలో ఏ జెండా ఎగరబోతోంది?