ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ వేదికగా మందకృష్ణ మాదిగను ప్రశంసలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను అసెంబ్లీ వేదికగా ప్రశంసలతో ముంచేత్తారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా తమ కులాలు పేర్లు చెప్పుకొని బతుకుతారు. కానీ నేను ఒక మాదిగ అని చెప్పుకునే పరిస్థితి లేని రోజుల్లోనే మందకృష్ణ మాదిగ తన పేరు చివర్లో మాదిగ అని చెప్పుకున్నారు. మాదిగ కులం ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన గుండె ధైర్యం మందకృష్ణ మాదిగ సొంతమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మాదిగ కులానికి ఆత్మగౌరవం, మంచి వాడిని తెచ్చి పెట్టిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని అసెంబ్లీ సాక్షిగా మందకృష్ణ మాదిగను ప్రశంసలతో ముంచెత్తారు పవన్ కళ్యాణ్.

కేటీఆర్ పాదయాత్ర… ఆంధ్రావాలా బాటలో నడుస్తున్నాడా?

ఇక ఎస్సీ వర్గీకరణ పోరు ఇక్కడ వరకు తీసుకురావడంలో మందకృష్ణ మాదిగ పాత్ర చాలా కీలకము అని చెబుతూనే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా మందకృష్ణ మాదిగను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా అభినందించారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మద్దతుగా నిలిచి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

Back to top button