
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయాలు నమోదు చేసుకోగా ఆ తరువాత బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ విజయాలను నమోదు చేశారు. ఇక అందరికంటే కంటే తక్కువగా విజయాలు నమోదు చేసిన బీజేపీ పార్టీ అభ్యర్థులకు తాజాగా బండి సంజయ్ వరాలు కురిపించారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంచాయతీలలో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థులు విజయం పొందారో వారందరికీ అలాగే ఆ గ్రామాల అభివృద్ధికి నిధుల కోసం ఆందోళన అవసరం లేదు అని వెల్లడించారు. తాజాగా కరీంనగర్ లోని సర్పంచులు మరియు ఉపసర్పంచులను సన్మానించిన బండి సంజయ్ బిజెపి అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన గ్రామాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు. అంతేకాకుండా ఆయా గ్రామాలలోని ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ఫ్రీగా సైకిల్స్ఇస్తాము అని ప్రకటించారు. ఇక ఎవరూ కూడా అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యానికి అత్యాధునిక పరికరాలు అనేది ఇచ్చాము అని ట్విట్ చేశారు.
Read also : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్
Read also : Terrace Garden Farmer: టెర్రస్ గార్టెన్ పంటల సాగుకు ఫిదా, మమతను సత్కరించిన కలెక్టర్ తేజస్ నందలాల్!





