
రంగారెడ్డి, క్రైమ్మిర్రర్: లారీ, అర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మందికి గాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్మేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ప్రమాదం సంభవించింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు తెలంగాణ ఆర్టీసి బస్సు వస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీ ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
-
తెలంగాణలో యాసంగి సాగు ఆశాజనకం: ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ పుంజుకోనున్న పంటల విస్తీర్ణం!
-
వర్షపాతంతో వణికిపోతున్న చెన్నై
-
బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
-
‘రామాయణం’పై రాజమౌళి ప్రశంసలు.. నవంబర్ 5 కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్!