
ఢిల్లీ, క్రైమ్మిర్రర్: మహిళలకు మగవారి నుంచే లైంగిక వేధింపులు చూస్తాము…ఇప్పుడు రోబో వల్ల కూడ లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి ఘటన తాజాగా జర్మనీలో చోటు చేసుకుంది. జర్మనీలోని హ్యూమనాయిడ్ రోబో 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. కొలోన్ నగరంలోని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న టీజేజీ అమ్మాయిల వద్దకు వచ్చిన ఆ రోబో.. ఒకరిని హగ్ చేసుకుని అసభ్యంగా తాకింది. దీంతో ఊహించని ఘటన ఎదురుకావడంతో ఆ టీనేజర్ ఒక్కసారిగా దిగ్ర్బాంతికి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోబోను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. ఈ ఘటనను సోషల్ మీడియాలో లైవ్లో ప్రసారం చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
జర్మనీలోని కొలోన్ నగరంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాలికను ఓ రోబోట్ వెనుక భాగంలో తాకినట్లు, ఆమె వైపు అసభ్యకరమైన లైంగిక సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రోబోట్ ఇద్దరు యువకులు నియంత్రిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో రోబో యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడైన 19 ఏళ్ల యువకుడు ఉద్దేశపూర్వకంగానే రోబోతో తప్పుడు పనిచేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. తమ వద్ద ఉన్న హ్యూమనాయిడ్ రోబోను వీధుల్లో వెళ్లే మహిళల దగ్గరకు పంపించి వారిని అసభ్యంగా తాకించడం, అసభ్య సంజ్ఞలు చేయించడంతో పాటు, వాటిని లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
ఆధ్యాత్మికత పేరుతో మహిళకు అసభ్యకర సందేశాలు…! కేసు నమోదు
-
జూనియర్ న్యాయవాదికి కిడ్నీలో రాళ్లు…ఆసుపత్రిలో చేరితే ప్రాణమే పోయింది…! మెడికవర్లో ఏం జరుగుతుంది…?
-
మమత బెనర్జీని హత్యచేసేందుకు కుట్ర…! కత్తితో వచ్చిన యువతి…పోలీసులకు అప్పగింత…
-
125 ఏళ్ల నిరీక్షణకు తెర…! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే…