జాతీయం

వివాదాస్పద ల్యాండ్ డీల్‌.. వాద్రాకు రూ.58 కోట్ల ముడుపులు!

Robert Vadra Money Laundering Case: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఆర్థిక నేరం కేసులో ఉచ్చు బిగుసుకుంటుంది.  గురుగ్రామ్‌ వివాదాస్పద ల్యాండ్ డీల్ కు సంబంధించి వాద్రాకు రూ.58 కోట్లు ముడుపులు అందినట్టు ఈడీ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. వాద్రాకు నోటీసులు జారీ చేసింది.

ఏంటి ఈ ల్యాండ్ డీల్ కేసు?

రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ గురుగ్రామ్‌ లోని షికోహ్‌ పూ లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని రూ. 7.50 కోట్లకు కొన్నట్లు సేల్ డీడ్‌ లో చూపించారు. కానీ,  ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరా రూ.15 కోట్లకు పైగానే ఉంది. పైగా చెక్కు ద్వారా చెల్లింపులు జరిపినట్టు పత్రాలు చూపించారు.  వాద్రా చెక్కు అసలు ఇప్పటి వరకు ఎన్‌ క్యాష్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆ భూమి వాద్రా సంస్థకు ఉచితంగా ఇచ్చేశారని ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తం లావాదేవీని ఒక లంచంగా భావిస్తోంది. ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌ సంస్థకు హౌసింగ్ స్కీమ్ లైసెన్స్ ఇప్పించేందుకు అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై వాద్రా ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ డీల్‌ లో భాగంగానే వాద్రాకు ఈ భూమిని సదరు సంస్థ ఉచితంగా ఇచ్చిందని ఈడీ వాదిస్తోంది. ఈ భూమి విలువను తక్కువ చేసి చూపించడం ద్వారా రూ.45 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా ఎగవేశారని వెల్లడించింది. ఆ కేసులో వాద్రాకు శిక్ష పడాలని ఈడీ వాదించింది.

Read Also: 6 యుద్ధ విమానాలు కూల్చామన్న భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button