
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: చాతిలో తీవ్రమైన నొప్పి, తీవ్రమై ఒత్తిడి, అధిక బరువు కారణంగా గుండె పోటు వచ్చేలక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాని మారుతున్న జీవనశైలి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. అయితే మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలాసార్లు స్వల్పంగా లేదా సాధారణ లక్షణాలకు భిన్నంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం యువతుల్లోనూ గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి.అందువల్ల మహిళలు తమ శరీరంలో కనిపించే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండడం అవసరం.
లక్షణాలు ఎలా ఉంటాయి…
మహిళల్లో గుండె సంబంధిత సమస్యల లక్షణాలు ఇతరులతో పోలిస్తే తక్కువ తీవ్రతతో కనిపిస్తాయి. ఛాతిలో అసౌకర్యం లేదా నొప్పి, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం సాధారణంగా మెనోపాజ్‌కు ముందు తక్కువగా ఉండి, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటి ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు గుండె జబ్బుల ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న మహిళలు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
పరీక్షల ద్వారా నిర్దారణ…
గుండెపోటుకు ముందు ఛాతిలో నొప్పి లేదా బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా సమీపంలోని అత్యవసర వైద్య విభాగానికి వెళ్లాలి. అక్కడ గుండెకు ఏమైనా నష్టం జరిగిందా తెలుసుకోవడానికి ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ట్రోపోనిన్ పరీక్ష కీలకమైనది. గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి కణాలు దెబ్బతిన్నప్పుడు ట్రోపోనిన్ అనే ప్రోటీన్ రక్తంలోకి విడుదలవుతుంది. రక్తంలో దీని స్థాయి పెరిగినట్లు తేలితే గుండె కండరాలు దెబ్బతింటున్నట్లు గుర్తించి, అవసరమైన చికిత్సను వెంటనే ప్రారంభిస్తారు.
జాగ్రత్త పడడం ముఖ్యం…
గుండె పరిస్థితిని అంచనా వేయడానికి ఛాతీ ఎక్స్‌రే, ఎకోకార్డియోగ్రఫీ వంటి ఇతర పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. ఛాతీ ఎక్స్‌రే ద్వారా గుండె పరిమాణం పెరిగిందా, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరిందా వంటి విషయాలను తెలుసుకునే వీలు ఉంది. ఎకో పరీక్షలో గుండె గదుల నిర్మాణం, గుండె ఎంత సమర్థంగా రక్తాన్ని పంప్ చేస్తోంది, గుండెలోని నాలుగు కవాటాల్లో ఏవైనా లీకేజీ లేదా ఇతర సమస్యలు ఉన్నాయా వంటి అంశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి ఛాతిలో అసౌకర్యం లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పోరుకు సుప్రీంకోర్టు పచ్చజెండా..!
-
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సీఎం కొడుకు..?
-
రాహుల్ గాంధీలో ఓ విచిత్రమైన దోరణి కనిపిస్తోంది….! కిషన్‌రెడ్డి…
-
ఈ నెల 10న ఢిల్లీలో ఆందోళనకు సీజేపీ పిలుపు…! కేంద్రం అప్రమత్తం…