తెలంగాణ

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్

భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో అల్లాపూర్ ను అన్ని రకాలుగా అధునాతన వసతులతో కూడుకున్నటువంటి అభివృద్ధి చేశామని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో వందల కోట్ల రూపాయలతో డివిజన్ లోని అన్ని బస్తి మరియు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ వార్డు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

వార్డు కార్యాలయంతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్ పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, అబ్దుల్ రహీం, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, జాహిద్ షరీఫ్ బాబా, సంజీవరెడ్డి, బొల్లు శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button