
-
3.22 ఎకరాల విషయంలో చర్యలు వద్దు
-
తెలంగాణ హైకోర్టు ఆదేశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ పెద్ద ఎత్తున భూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా అవినీతి బాంబు పేల్చారు. కెసిఆర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువుల పేరుతో భారీగా భూములు కొల్లగొట్టారు అని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మామ మాధవరావు హనుమంతురావు పేరు కూడా తెరపైకి వచ్చింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వేలికట్ట గ్రామంలోని ఆయనకు చెందిన 3.22 ఎకరాల భూమి విషయంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెబెన్యూ శాఖ శోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే ఆ అంశంపై తాజాగా హనుమంతురావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది ఆ భూమి విషయంలో ప్రభుత్వం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని.. ఆయనను ఆ భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది.
కెసిఆర్ కుటుంబమే టార్గెట్…
రేవంత్ సర్కార్ ప్రధానంగా కెసిఆర్ కుటుంబ సభ్యులపై ఉన్న భూ వివాదాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొండపాక మండలం వేలికట్ట గ్రామంలో ఉన్న 3.22 ఎకరాల భూమిని అసైన్డ్ భూమిగా పేర్కొంటూ.. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తూ రెవెన్యూ అధికారులు గత సెప్టెంబర్ 29న హనుమంతరావు నోటీసులు జారీ చేశారు. అయితే అధికారులు నిర్దేశిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆ నోటీసును రద్దు చేయాలని కోరుతూ హనుమంతురావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరుపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. రెవెన్యూ అధికారులు తమ క్లైంట్ కు సరైన వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
బలమైన వాదనలు…
హనుమంతరావు చాలా ఏళ్ల కిందటె మార్కెట్ ధర చెల్లించి సదరు భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదే తరహా వ్యవహారాల్లో గతంలో హైకోర్టు ఇతర పిటీషనర్లకు ఇచ్చిన ఊరటనే.. తమ క్లైంట్ కు కూడా వర్తింపజేయాలని కోరారు. పిటిషనర్ తన వివరణ సమర్పించే వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోమని ప్రభుత్వ లాయర్ హామీ ఇచ్చారు. నోటీసు నిలిపివేయడం వల్ల తదుపరి ప్రక్రియ స్తంభించి పోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటిస్ కు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హనుమంతురావును ఆదేశించారు. దసరా సెలవుల అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఈ లోగా ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇవి కూడ చదవండి:
-
ఘోర రోడ్డు ప్రమాదం…! మిమిక్రీ ఆర్టిస్టు దుర్మరణం…
-
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు…! రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయాంశం….
-
సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు!
-
ముంబై నిరసనలో అమీర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదుకు బీజేపీ నేత సిద్ధం!