
మహేశ్వరం,(క్రైమ్ మిర్రర్):- మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల గ్రామంలో ఉన్న చిరు వ్యాపారులు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన రావిర్యాల బిసినెస్ అసోసియేషన్ అనే పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్,నంబర్( 813/2025 )ఈ సంఘానికి అధ్యక్షులుగా ఆకుతోట లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా సౌకుంట్ల పాండు,బోద దామోదర్ రెడ్డి, పార్లకూర్ల ఆంజనేయులును ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ..గ్రామంలోని చిరు వ్యాపారం చేసుకునే వారందరూ మమేకం కావాలని అన్నారు.ఇతర రాష్ట్రాల నుండి,ప్రాంతాల నుండి మన గ్రామానికి వచ్చి మన వ్యాపారాలపై పోటీ పడుతూ ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు.కావున ఇకపై మన గ్రామానికి ఇతర రాష్ట్రాల వారిని రాకుండా కలిసికట్టుగా ఉండి పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావిర్యాల గ్రామ చిరు వ్యాపారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
read also : ముంబైలో దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం!
Read also : ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి…? ఆ 10మందిపై వేటు తప్పదా..?