
ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. పాల్గుణ మాసం అమావాస్య తిదిని సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో సంభవించే ఈ సూర్యగ్రహణం చాలా ప్రభావాలు చూపించే అవకాశం ఉందని ప్రముఖ పండితులు తెలుపుతున్నారు.
ఈ ఏడాది హోలీ సందర్భంగా అంటే మార్చి 14న చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నదని మాత్రమే కాదు… ఒకేసారి అనేక శుభ యోగాలు ఏర్పడతాయంటున్నారు పండితులు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గుణ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరగుతుందంటున్నారు. జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారింది జ్యోతిష్కులు చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు.. సూర్యుడికి, మధ్య భూమి వచ్చినప్పుడు.. చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కనుక భారతదేశంలో కనిపించదు.
ఈ సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపిస్తోంది. ఉత్తరాబాధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్య గ్రహణం ఏర్పడటం చేత, ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని తెలిపారు.
విదేశాలైన అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కలిపించవచ్చు.ఈ సూర్య గ్రహణం ఏర్పడు పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ద వాతావరణం పెరగడం, ఆర్థికమాంద్యం కలగడం, ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయంటున్నారు.
Also Read : 10 ఎకరాల వరకు రైతు భరోసా.. ఉగాది వరకు అందరికి డబ్బులు!
హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ టైంలో బెడ్ దిగరు.. కాలు కదపరు.. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం.. జపం చేసుకుంటారు. మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
మధ్యాహ్నం 2.21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణం అయిన తరువాత దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణం సమయంలో జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జపాన్ని చేయించుకుంటే తగ్గుతాయని చెబుతున్నారు.





