
బంగాళాఖాతంలో ఈ మధ్య అల్పపీడనాలనేవి తరచూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ డిసెంబర్ నెల ఏడో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడి భారీగా పలుచోట్ల వర్షాలు పడిన విషయాలు మనందరికీ తెలిసిందే. అయితే రేపు మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఇప్పటికే ఈ అల్పపీడనాల వల్ల నాన్ స్టాప్ గా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసిందే.
పరామర్శ ఓకే!.. కానీ చావుతో పోరాడుతున్న పిల్లాడి పరిస్థితి ఏంటి?
ఇక రేపు ఏర్పడేటువంటి అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం ద్వారా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే చాలా మంది రైతులు చాలా భయం భయంగా బతుకుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా భారీ వర్షాలు కురవడం వల్ల చాలామంది పంట నాశనం అవుతుంది. కాబట్టి వర్షాలు కురిస్తే పంట మునిగిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
బిగ్ బాస్ విన్నర్ గా నిఖిల్!… ప్రైజ్ మనీ 88 లక్షలా?
ఇక ఈ అల్పపీరణాలు ఏర్పడేందుకు చాలా కారణాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య ఋతుపవనాలు చురకగా కదులుతుండడం అలాగే థాయిలాండ్ పరిసర ప్రాంతాల పరిస్థితులు అనుకూలంగా ఉండటమే ఈ అల్పపీడనాలకు గల కారణమని అన్నారు. ఇక ఈ డిసెంబర్ నెల ఆఖరి వరకు వర్షాలు కురుస్తూనే ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. కాబట్టి చలి కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది.