సినిమా

దీపికాను తీసేయడం పట్ల సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య వార్?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రభాస్ మరియు దీపిక పదుకొణే కాంబినేషన్లో వచ్చినటువంటి కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సినిమా సీక్వెన్స్ గా కల్కి-2 కూడా అనౌన్స్ చేశారు. కానీ కల్కి పార్ట్ 2 లో బాలీవుడ్ నటి దీపిక పదుకొణే నటించబోరని చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర బృందం పేర్కొన్నారు. సాధారణంగా పెద్ద సినిమాలలో నటించాలి అంటే నటులకు ఎక్కువగా కామెంట్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఆమె తక్కువ షూటింగ్ టైం అలాగే తన టీం లో మొత్తం 25 మంది ఉన్నారు.. వారందరినీ కూడా లగ్జరీ హోటల్లో ఉంచాలని.. అంతేకాకుండా 25% రెమ్యూనిరేషన్ కూడా పెంచాలని దీపిక పదుకొణే కొన్ని డిమాండ్స్ చేశారని సమాచారం. రోజుకు ఐదు నుంచి ఏడు గంటలు మాత్రమే పని చేస్తానని తన డిమాండ్స్ చెప్పడంతో.. చిత్ర బృందం దీపిక పదుకొణేను పార్ట్ 2 నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి.

Read also : వేలంలో ఒక్క ప్లాటు అమ్ముడుపోలే.. HMDAకు బిగ్ షాక్

అయితే చిత్ర బృందం హీరోయిన్ దీపిక పదుకొణేకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వడానికి మాకు ఓకే అని.. కానీ షూటింగ్ టైం తగ్గించడానికి అసలు వీలు కాదు అనే కారణంతో మూవీ మేకర్స్ ఆమెను తప్పించారని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏది ఏమైనా కూడా… ఇప్పుడు ప్రభాస్ మరియు దీపికా పదుకొణే ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతుంది. ఇన్ని డిమాండ్స్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుందని… టైమింగ్స్ తగ్గించడం వల్ల చిత్రం రిలీజ్ అవ్వడానికి చాలా లేట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చిత్ర బృందం చేసింది కరెక్టే అని సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు దీపిక పదుకొనే ఫ్యాన్స్.. ఆమె కడుపుతో ఉన్నా కూడా సినిమాలో నటించింది. సినిమాపై ఆమెకున్న కమిట్మెంట్ కల్కి సినిమా ద్వారా రుజువయింది. అలాంటి మా హీరోయిన్ దీపికా పదుకొనేను మూవీ నుంచి తొలగించడం తప్పే అని దీపిక పదుకొనే ఫ్యాన్స్ కల్కి చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also : రాజగోపాల్ రెడ్డిపై సీఎం రేవంత్ పగ! మారిన RRR అలైన్ మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button