ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం : మంత్రి నారాయణ

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించడం ప్రారంభించింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లుగా మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. గాంధీ జయంతి రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటగా ఏపీలోని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు.

Read also : ఈ చిట్కాలు పాటించండి.. ఏ జబ్బు మీ దరిదాపుకు రాదు?

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 31వ తేదీ లోపు మొత్తం చెత్తను కూడా పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ నేడు స్పష్టం చేశారు. మొట్టమొదటిగా అమరావతి నుంచే ప్రారంభిస్తామని అన్నారు. అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాము అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్నిచోట్ల ప్లాస్టిక్ ను నిషేధిస్తే చాలా బాగుంటుంది అని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అదికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ అనేది భూమిలో ఇంకిపోవడానికి దాదాపు చాలా సంవత్సరాలు పడుతుంది అని శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో అధ్యయనాలలో తేలింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ విషయంలో మరింత దీర్ఘంగా ఆలోచించాలని… పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా రూల్స్ తీసుకురావాలని చాలామంది కోరుతున్నారు. కానీ అది అసాధ్యమైన… సుసాధ్యం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది.

Read also : మద్దూరులో ఘనంగా విశ్వకర్మ జయంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button