ఆంధ్ర ప్రదేశ్

జాతికి అంకితం అన్నారు.. ప్రాజెక్టును గందరగోళం చేశారు : చంద్రబాబు

క్రైమ్ మిర్రర్, ప్రకాశం జిల్లా :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుపై మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గళం విప్పారు. ప్రకాశం జిల్లా ప్రజల కోరిక వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం. 1996వ సంవత్సరంలో మేము వెలిగొండ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేశామని స్పష్టం చేశారు. ఆ తరువాత పనులు ఆగిపోయిన మళ్లీ 2014-19 కాలంలో మొదటి టన్నెల్ కు 95% పనులు పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఆ తరువాత 2019 వ సంవత్సరంలో రాష్ట్రంలోకి వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో.. అప్పటినుంచి వెలుగొండ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా గందరగోళం చేశారని మండిపడ్డారు.

Read also : ఎమ్మెల్సీలకు గవర్నర్ బ్రేక్? – రాజ్‌భవన్‌లో కదలని గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఫైల్‌

వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా మీరు గమనిస్తే… కూటమి ప్రభుత్వం వస్తేనే పనులు స్పీడ్ అప్ చేస్తుంది అని స్పష్టం చేశారు. వచ్చే జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు.. అభివృద్ధి పనులపై నిరంతరం నిఘా పెడతానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎవరైనా సరే అభివృద్ధి పనులకు అడ్డుపడిన.. అది మా ప్రభుత్వంలోని నాయకులైనా.. ఇతర పార్టీ నాయకులైన సరే వదిలిపెట్టబోనని అన్నారు.

Read also : భారీ వర్షాలతో హైదరాబాద్ చిత్తడి – గంటపాటు దంచికొట్టిన వాన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button