
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో ప్రభుత్వాలు, ప్రజలు చేసిన కొన్ని తప్పిదాల వల్ల నేడు హైదరాబాద్ ప్రాంతమంతా కూడా భారీగా పడుతున్న వర్షాలకు మునిగిపోతుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?.. అని ఎప్పుడైనా ఆలోచించారా!.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని కొన్ని ప్రదేశాల్లో నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, చుట్టుపక్కల నివసించే ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. డ్రైనేజీ సిస్టం మెరుగు పడకపోవడంతో.. రోడ్లపై నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతుంది. దీంతో చాలామంది వాహనదారులు అలాగే ప్రజలు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా డ్రైనేజీ సిస్టం గురించి ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు అని వాపోతున్నారు.
Read also : మిర్యాలగూడ ఎమ్మెల్యే డ్యామేజ్ కంట్రోల్.. రైతుల కోసం సీఎం రేవంత్ కు 2 కోట్ల చెక్
అసలు.. 2021 జనాభా అంచనాలకు తగ్గట్లుగా 1989లో అప్పటి ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా డ్రైనేజీ సిస్టం అనేది కొంచెం కూడా మెరుగుపరచలేకపోయారు. తిరిగి మళ్లీ 2015 వ సంవత్సరంలో ఎన్నో ప్రతిపాదనలు చేసిన కూడా నిధుల కొరతతో… అవి కాగితాలు గానే మిగిలిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… కొంతమంది పలు సిటీలలోని చెరువులు అలాగే భూములను కబ్జా చేసి బిల్డింగ్స్ నిర్మించడం వల్ల నేడు ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా.. హైదరాబాదు ఇలాంటి పలు ముఖ్య నగరాలలో డ్రైనేజ్ సిస్టంను మెరుగుపరచాల్సిన అవసరం చాలానే ఉంది. డ్రైనేజీ సిస్టం పై ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేకపోతే అప్పుడప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు వాహనదారులే కాకుండా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లాలంటేనే.. వాహనదారులకు చిరాకు అనిపిస్తుంది. ప్రభుత్వాలు వీటిపై చర్చలు జరిపి మరోసారి ఇలాంటి దుస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. నిరాశలో అభ్యర్థులు!