
క్రైమ్ మిర్రర్, నల్గొండ : తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకనిక చాకలి ఐలమ్మ అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి అన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వెంకటేశ్వర సహకార సంఘం సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఉప్పల లింగస్వామి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాటస్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. బహుజన చైతన్యానికి మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప వ్యక్తి ఐలమ్మ అన్నారు.
Also Read : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న హైడ్రా
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్, పిఎసిఎస్ డైరెక్టర్ కృష్ణ, రాచకొండ రమేష్ బాబు రజక సంఘం మాజీ అధ్యక్షులు ఉప్పల రాజయ్య, ఉప్పల ముత్యాలు, ఏపూరి శివయ్య, చిలక రాజు సత్తయ్య, ఏపూరి నరసింహ, ఉప్పల అద్విక్, అన్విక్ తదితరులు పాల్గొన్నారు.